Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఓట్ చోరీలో మోడీ, అమిత్ షాలదే కీ రోల్.. ఈ విషయం దేశమంతటికీ తెలుసు: రాహుల్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- Congress leader Rahul Gandhi held a rally in Margao, South Goa, where he accused Prime Minister Narendra Modi, Home Minister Amit Shah, and the Chief Election Commissioner (CEC) of conspiring in 'vote theft'. He claimed that BJP leaders avoided filing defamation cases against him regarding these allegations because they feared a full-scale legal battle would expose their involvement.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
పనాజీ: ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేష్ కుమార్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు. ఆదివారం (అక్టోబర్ 18) సౌత్ గోవాలోని మడ్గావ్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ గోయ్ రఖోన్ యాత్ర ముగింపు సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఓట్ చోరీకి పాల్పడుతున్నాడని.. ప్రధాని మోడీ, అమిత్ షా అతని వెనక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం దేశమంతటికీ తెలుసని పేర్కొన్నారు.
బీజేపీ నేతలు తనపై దాదాపు 45 కంటే ఎక్కువ పరువు నష్టం కేసులు పెట్టారు. కానీ ఆరోపణలపై మాత్రం తనపై ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఎందుకంటే.. ఒకవేళ వారు ఓట్ చోరీ గురించి కేసు పెడితే అది పూర్తిస్థాయి న్యాయపోరాటంగా మారుతుంది. అప్పడు తాము కూడా ఇందులో చిక్కుకుంటామని వారు భయపడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు.