Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
By Eenadu2 min read at Eenadu
In brief
The District Collector of Basara, Bavanesh Mishra, participated in the 'Maa Indiramma Intlo Deepavali' program in Labdhi village, where he celebrated Diwali with beneficiaries of the Indiramma housing scheme.
The collector praised the village for its progress, while the beneficiary, Anusha Bai, expressed gratitude to the government and the collector for providing her family with a new home.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బాసర: ఇల్లు లేని పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. ఆదివారం బాసర మండలం లాబ్ధి గ్రామంలో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు తోకలవాడ్ అనూష బాయి–నర్సింగ్ కుటుంబంతో కలిసి వారి నూతన గృహంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇంటి నిర్మాణ వివరాలు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపి, వారిని శాలువాతో సత్కరించారు. మిఠాయిలు, పిల్లలకు టపాసులు, నోటుపుస్తకాలు అందజేసి చక్కగా…
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లాబ్ధి గ్రామం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందు వరసలో ఉండటం . ఇతర గ్రామాలకు ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంలో విశేష పురోగతికి కృషి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేద కుటుంబాల్లో సొంతింటి ఆనందం వెల్లివిరుస్తోందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. లబ్ధిదారుల ఇంట్లో వారితో కలిసి దీపావళి నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)