Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఫిబ్రవరిలో జరిగే మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
మంత్రి సీతక్క ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆమె ములుగులో జిల్లా స్థాయి మెగా రైతు మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
అలాగే గోవిందరావుపేట మండలంలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం అభినందనీయమన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
తాడ్వాయి/ములుగు, వెలుగు : ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. శనివారం మేడారంలోని హరిత హోటల్లో కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే రెండు నెలల పాటు తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, రహదారుల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, భవిష్యత్ అవసరాలు, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత మౌలిక వసతుల కల్పనకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అనుబంధ జాతరైన ఐలాపురంలో వసతుల కల్పనకు ఐటీడీఏ చర్యలు తీసుకోవాలని…
అంతకుముందు వనదేవతలను దర్శించుకుని ఆలయ పరిసరాలను పరిశీలించారు. మరోవైపు ములుగు మండలం ఇంచెర్లలోని ఎంఆర్ ఫంక్షన్ హాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా రైతులు పంటల మార్పిడి, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు రూ.145 కోట్లతో పోట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రూ.35 కోట్లతో రామప్ప–లక్నవరం అనుసంధాన కాలువ పనులు చేపట్టి సాగునీటి భద్రత కల్పిస్తామని…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)