Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రక్తదానం ఆపదలో ఉన్నవారికి ప్రాణదానంతో సమానం : సీపీ
By Eenadu||1 min read at Eenadu
In brief
Khammam Police Commissioner Sunil Dutt inaugurated a blood donation camp at the Khammam Police Headquarters on Saturday.
He appealed to the public to donate blood to help those in medical emergencies, emphasizing it as a valuable social service.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఖమ్మం నేరవిభాగం: రక్తదానం ఆపదలో ఉన్నవారికి ప్రాణదానంతో సమానమని, ప్రతీ ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పిలుపునిచ్చారు. దేశ రక్షణ, అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకుంటూ, ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శిబిరాన్ని ప్రారంభించగా, మొత్తం 150 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అమరవీరుల స్ఫూర్తితో ప్రజాసేవలో భాగస్వాములవుతూ, రక్తదానం ద్వారా…
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, రక్తదానం అత్యంత విలువైన సామాజిక సేవ అని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఏ ఒక్కరి ప్రాణం ప్రమాదంలో పడకుండా స్వచ్ఛందంగా రక్తదాతలు ముందుకు రావాలన్నారు. ఆరోగ్యవంతులైన యువత రక్తదానంపై అవగాహన పెంపొందించుకుని, ఇతరులకు ప్రాణదాతలుగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏఆర్ డీసీపీ కుమారస్వామి, టౌన్ ఏసీపీ రమణమూర్తి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, ఏఆర్ ఏసీపీలు సుశీల్ సింగ్, నర్సయ్య, డాక్టర్ కార్తీక్, ఆర్ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, అప్పలనాయుడు, సిఐలు షాదీక్ పాషా, రామకృష్ణ, చిట్టిబాబు, నాగరాజు, కరుణాకర్, శివప్రసాద్ పాల్గొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)