Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 165 టన్నుల బంగారాన్ని విదేశీ వాల్ట్ల నుంచి స్వదేశానికి తరలించిందని ఈ నివేదిక తెలిపింది.
దీంతో దేశీయంగా భద్రపరిచే బంగారు నిల్వలు 65.4 శాతం నుంచి 84 శాతానికి పెరిగాయని ఆర్బీఐ వివరించింది.
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత విదేశీ ఆస్తుల భద్రతపై ఆందోళనల కారణంగానే ఈ వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
RBI Gold Reserves | విదేశాల్లో భద్రపరిచిన బంగారాన్ని భారత్ వేగంగా స్వదేశానికి తరలిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఏకంగా 165 టన్నుల బంగారాన్ని విదేశీ వాల్ట్ల నుంచి వెనక్కి తెచ్చింది. దీంతో మొత్తం బంగారం నిల్వల్లో దేశీయంగా భద్రపరిచే వాటా 65.4 శాతం నుంచి 84 శాతానికి పెరిగింది. ఏడాది క్రితం భారత్లో 575.82 టన్నుల బంగారం ఉండగా.. ఇప్పుడు 740.13 టన్నులకు చేరింది.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లోనే ఆర్బీఐ విదేశాల్లో ఉన్న 60.08 టన్నుల బంగారాన్ని భారత్కు తీసుకొచ్చింది. మార్చి చివరికి దేశీయంగా 680.05 టన్నులుగా ఉన్న నిల్వలు సెప్టెంబర్ చివరికి 740.13 టన్నులకు పెరిగాయి. దీంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) వద్ద ఉన్న భారత బంగారం 197.67 టన్నుల నుంచి 140.39 టన్నులకు తగ్గింది. మొత్తం బంగారం నిల్వలు మాత్రం దాదాపు స్థిరంగా 880.18 టన్నుల నుంచి 880.52 టన్నులకు చేరాయి. అంటే కొత్త కొనుగోళ్ల కంటే విదేశాల్లో ఉన్న బంగారాన్ని వెనక్కి తీసుకురావడమే ప్రధానంగా కనిపిస్తోంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)