Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
సీనియర్ అధికారుల డ్రెస్‌కోడ్‌పై వెనక్కి తగ్గిన ఆర్మీ.. డిసెంబర్ 1 నుంచి పాత నిబంధనలు - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
భారత సైన్యం 2023లో సీనియర్ అధికారుల యూనిఫాం నిబంధనల్లో చేసిన మార్పులను వెనక్కి తీసుకుని, డిసెంబర్ 1 నుంచి పాత విధానాన్ని పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది.
అధికారుల అభిప్రాయాలు మరియు సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ తెలిపింది.
ఈ పాత నిబంధనల ప్రకారం రెజిమెంటల్ గుర్తులు మరియు లాన్యార్డులు తిరిగి వస్తాయని, అలాగే ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ కూడా తన యూనిఫాంలో మార్పులు చేసుకోనున్నారని నివేదించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
భారత సైన్యం సీనియర్ అధికారుల యూనిఫాం నిబంధనల్లో కీలక మార్పు చేయాలని నిర్ణయించింది. 2023లో తీసుకొచ్చిన డ్రెస్‌కోడ్ మార్పులను వెనక్కి తీసుకుంటూ పాత విధానాన్ని పునరుద్ధరించనుంది. ఈ మేరకు నవంబర్ 13న ‘Dress for Brig & Above Rk Offrs’ అనే శీర్షికతో అంతర్గత లేఖ జారీ చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ (HT) వెల్లడించింది. సీనియర్ నాయకత్వంలో అందరికీ ఒకే విధమైన యూనిఫాం ఉండాలనే ఉద్దేశంతో గతంలో బ్రిగేడియర్ హోదా, అంతకంటే పై స్థాయి అధికారులకు ఉమ్మడి డ్రెస్‌కోడ్‌ను అమలు చేశారు.
రెజిమెంటల్ గుర్తులు, లాన్యార్డుల తొలగింపు2023 ఆగస్టులో అమల్లోకి వచ్చిన మార్పుల ప్రకారం.. సీనియర్ అధికారులు తమతమ ఆర్మ్స్, సర్వీసులకు సంబంధించిన ప్రత్యేక గుర్తులను యూనిఫాంపై ధరించకూడదని నిర్ణయించారు. భుజానికి వేలాడదీసే లాన్యార్డ్ (Lanyard)ను కూడా తొలగించారు. అలాగే డార్క్ గ్రీన్ బెరెట్‌లు, ఒకే తరహా బెల్టులు, ఇత్తడితో తయారుచేసిన ర్యాంక్ గుర్తులను తప్పనిసరి చేశారు. సీనియర్ అధికారులంతా నల్లటి బూట్లనే ధరించాలని నిబంధన విధించారు.ఈ మార్పులు మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ హోదా అధికారులతో పాటు ఆర్మీ చీఫ్‌కు కూడా వర్తించాయి.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)