Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సింగరేణి స్కామ్లపై ఎంక్వైరీకి రెడీ
By NT News telugu||5 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- BRS Working President KTR demanded a judicial inquiry into alleged scams in the Singareni coal company, stating he would present evidence against Chief Minister Revanth Reddy, his brother-in-law Sridhar Reddy, and the state government. He also criticized the Congress government's handling of power supply and water management, contrasting it with the previous BRS administration's policies.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
రేవంత్రెడ్డీ..సింగరేణి కుంభకోణాలపై నేను ఉత్తరం రాస్తే విచారణకు ఆదేశిస్తానన్నవు కదా.. ఎస్.. నేను సిట్టింగ్ జడ్జితో విచారణకు రెడీ.. దమ్ముంటే వెంటనే జడ్జికి లేఖ రాయి. నేను ఆధారాలు సమర్పించి నువ్వు, నీ బామ్మర్ది, నీ సర్కార్ అక్రమాలను బట్టబయలు చేస్తా..
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తేతెలంగాణ) : సింగరేణి సంస్థలో స్కామ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. జడ్జికి రేవంత్రెడ్డి లేఖ రాస్తే తాను పూర్తి ఆధారాలు సమర్పిస్తానని తేల్చిచెప్పారు. ‘బొగ్గు అంశంలోనే కాదు.. నువ్వు చేసిన , నీ బామ్మర్ది సృజన్రెడ్డి సింగరేణిలో కొల్లగొట్టిన రూ. 10 వేల కోట్ల , నువ్వు చేసిన పవర్ స్కామ్, విదేశీ బొగ్గు కొనుగోలు పేరిట సాగుతున్న కమీషన్ల బాగోతాన్ని కూడా బయటపెట్టేందుకు సిద్ధం’ అని ప్రకటించారు.