Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
USA: అమెరికా ఇమిగ్రేషన్ కస్టడీలో 1,389 మంది భారతీయ చిన్నారులు! - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడి ప్రభుత్వం వలసల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకుంటోంది.
ఈ చర్యల్లో భాగంగా పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఇమిగ్రేషన్ అధికారుల కస్టడీలోకి వెళ్తున్నారని నివేదికలు వెల్లడించాయి.
2023 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,389 మంది ఒంటరి భారతీయ చిన్నారులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసల నియంత్రణపై అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.ముఖ్యంగా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని గుర్తించి, తిరిగి వారి స్వదేశాలకు పంపిస్తోంది. ఈ చర్యల్లో భాగంగా పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఇమిగ్రేషన్ అధికారుల కస్టడీలోకి వెళ్తున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,389 మంది ఒంటరి భారతీయ చిన్నారులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తాజాగా వెల్లడైంది.అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం విడుదల చేసిన తాజా నివేదికల్లో ఈ వివరాలు ఉన్నాయి. వీరిలో చాలామంది అమెరికా సరిహద్దుల్లో…
2026 అక్టోబర్ వరకు అదుపులోకి 722 మంది చిన్నారులుతల్లిదండ్రులు లేదా సంరక్షకులు తోడుగా లేకుండా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పిల్లలను అధికారులు అన్అకంపెనీడ్ చిల్డ్రన్ గా పరిగణిస్తారు. ఈ తరహాలో అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల కస్టడీలోకి వచ్చిన చిన్నారుల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 1.1 లక్షలకు చేరినట్లు నివేదికలు పేర్కొన్నాయి.ఇక 2026 అక్టోబర్ వరకు 722 మంది చిన్నారులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.అయితే అమెరికాలో వీసా నిబంధనలు కఠినతరం కావడం, అక్రమ వలసదారులపై దేశ బహిష్కరణ చర్యలు పెరగడంతో ఒంటరిగా వస్తున్న భారతీయ చిన్నారుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)