Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Visa Categories: ‘టూరిస్ట్’ ఇకపై ‘విజిటర్’.. వీసా ప్రక్రియలో కేంద్రం కీలక మార్పులు
By Eenadu1 min read at Eenadu
In brief
The central government has announced major changes to India's visa process, reducing the number of categories and fields to make it simpler for foreign tourists.
According to the Ministry of Home Affairs, these updates aim to align with global standards and improve processing capacity.
The article also notes that the IT systems are being updated to implement these changes by the end of the year.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: విదేశీ పౌరులకు వీసా ప్రక్రియను మరింత సరళతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. వీసా విధానంలో సమూల మార్పులు చేపట్టింది. ప్రధాన వీసా కేటగిరీల సంఖ్యను 13 నుంచి తొమ్మిదికి, ఉప కేటగిరీల సంఖ్యను 49 నుంచి 23కి తగ్గించింది. అదేవిధంగా వీసా దరఖాస్తుల్లో నింపాల్సిన వివరాల (ఫీల్డ్స్) సంఖ్యను 65-70 శాతం మేర కుదించింది. వీసా విధానాన్ని మరింత సమగ్రంగా, పారదర్శకంగా మార్చడంతోపాటు భారత్‌ను సందర్శించే విదేశీ పౌరుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే ఈ మార్పుల ఉద్దేశమని కేంద్ర హోం శాఖ (MHA) ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘భారత వీసా విధానాన్ని మరింత సరళీకరించే క్రమంలో.. అభివృద్ధి చెందిన దేశాల వీసా వ్యవస్థలను, ప్రపంచ ప్రమాణాలను అధ్యయనం చేశాం. ఈ మార్పుల వల్ల వీసా దరఖాస్తును పూర్తి చేయడానికి పట్టే సమయం, శ్రమ తగ్గుతాయి. వీసా ఫారంలను మరింత నిశితంగా పరిశీలించి, ప్రాసెస్ చేయడానికి వీలవుతుంది. తద్వారా వీసాల జారీ సామర్థ్యం కూడా పెరుగుతుంది’’ అని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ మార్పులకు అనుగుణంగా ఐటీ వ్యవస్థలను అప్డేట్ చేస్తున్నామని తెలిపింది. కొత్త మార్పుల కింద.. ఈ ఏడాది చివరినాటికి వీసాలు మంజూరు చేస్తామని వెల్లడించింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)