Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Wet crops | ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని కొండపల్లి, ఎడవెల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఆరుతడి పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తక్కువ నీటి అవసరమున్న మొక్కజొన్న, జొన్న, పెసర, శనగ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.
పంటల వైవిధ్యీకరణ, ఆధునిక నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు, అలాగే ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందిస్తోందని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రెబ్బెన నవంబర్ 20 : ప్రస్తుత ఎల్ నీనో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు నీటి లభ్యతలో అనిశ్చితిని దృష్టిలో ఉంచుకొని ఈ రబీ సీజన్లో రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటి అవసరమున్న ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి దిలీప్ కుమార్ సూచించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జి జిల్లా రెబ్బెన మండలంలోని కొండపల్లి, ఎడవెల్లి గ్రామాలలో శుక్రవారం రెబ్బెన ఆధ్వర్యంలో ఆరుతడి పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న, జొన్న, పెసర, శనగ తదితర పంటలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, ఒకే పంటపై ఆధారపడే పరిస్థితి తగ్గి, చీడపీడల ఉధృతి పంట నష్టాల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని రైతులకు వివరించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వ్యవసాయ యాంత్రీకరణ, ఆధునిక నీటి యాజమాన్య పద్ధతులను రైతులు వినియోగించుకోవాలని సూచించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)