Andhra Jyothy ·
టమాటా, మామిడి పంటలకు బీమా
Home » Andhra Pradesh » AP Farmers Advised to Pay Crop Insurance Premiums Before Deadlines
ABN , Publish Date - Nov 22 , 2026 | 02:44 AM
Trending search
14 analysed of 15 matched articles · 4 outlets · last listed 23 Nov 2026 05:13 IST
Data source: Google Trends — search attention, not opinion
This search term is no longer in Google’s trending list. The page stays up; it is no longer refreshed.
n = 14 analysed articles from 4 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ ప్రస్తుత రబీ సీజన్ 2026-27లో టమాటా, మామిడి రైతులకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. టమాటా రైతులు డిసెంబరు 15లోగా, మామిడి రైతులు డిసెంబరు 31లోగా ప్రీమియం చెల్లించాలని వ్యవసాయశాఖ సూచించింది.
Eenadu
అర్హులైన ప్రతి ఒక్కరూ బీమాను సద్వినియోగం చేసుకోవాలి
Andhra Jyothy ·
Home » Andhra Pradesh » AP Farmers Advised to Pay Crop Insurance Premiums Before Deadlines
ABN , Publish Date - Nov 22 , 2026 | 02:44 AM
Eenadu ·
ఖమ్మం కార్పొరేషన్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను స్తంభాద్రి పట్టణ అభివృద్ధి సంస్థ(సుడా) ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పరిశీలించారు. నగరంలో ఏర్పాటుచేసిన కేంద్రాలను పరిశీలించి స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీవిత బీమా వల్ల చేకూరే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ బీమాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నగరంలోని అభయ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఖాదర్ బాబా, సహాయ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఖమ్మం కార్పొరేషన్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథక దరఖాస్తు కేంద్రాలను సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పరిశీలించారు. స్థానికులకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ బీమాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
V6 Velugu
ఇందిరమ్మ బీమా మార్గదర్శకాలు రిలీజ్.. కుటుంబానికి రూ.5 లక్షల బీమా! ఎవరెవరు అర్హులంటే?
తెలంగాణలో ఇందిరమ్మ బీమా పథకం నమోదుకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. 5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు.
Namasthe Telangana
‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో సర్పంచ్ బాణోతు నరసింహ, ఎంపీడీవో జమలారెడ్డి అధ్యక్షతన ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి ఈ పథకాన్ని అమలు చేయడమే లక్ష్యమని అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Eenadu ·
మల్కాపూర్(తాండూరుగ్రామీణ): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు మండలం మల్కాపూర్‌లో బీమా పథకాన్ని శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పథకానికి సంబంధించి అర్హతలు, నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియపై గ్రామస్థులకు వివరించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి బీమా ద్వారా రూ.5 లక్షలు అందిస్తామన్నారు. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా బీమా ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సుధీర్, విపని అధ్యక్షులు శ్రీనివాస్, పీఎసీఎస్ అధ్యక్షులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
V6 Velugu ·
హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ బీమా పథకం నమోదుకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. అయితే ఒక రేషన్ కార్డుపై కుటుంబంలో ఒక్కరికి మాత్రమే బీమా పొందే అవకాశం ఉంటుంది.
ఇందిరమ్మ బీమా పథకంలో ఒక కుటుంబానికి ఒకరిని మాత్రమే బీమా కోసం నమోదు చేస్తారు. రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అయితే బీమా పొందే వ్యక్తి ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొనే అవకాశం కల్పించారు. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే నామినీ లేదా నామినీలకు రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుంది.
V6 Velugu ·
కోహెడ, వెలుగు: గతంలో భూమి ఉన్న రైతులకు మాత్రమే బీమా సౌకర్యం ఉండేదని, ప్రజాపాలన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ పథకానికి లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని, పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » indiramma family life insurance registration telangana 5 lakh insurance
ABN , Publish Date - Nov 21 , 2026 | 06:11 AM
Eenadu ·
వాటి పరిధిలోకి రాని వారికే ఇందిరమ్మ బీమా స్వయంగా హాజరైతేనే లబ్ధిదారుల నమోదు కుటుంబానికి ఒకరి పేరిటే బీమా మరణిస్తే నామినీలకు రూ.5 లక్షల సాయం.. ప్రభుత్వ మార్గదర్శకాలు
ఈనాడు, హైదరాబాద్: వివిధ శాఖల ద్వారా ఇప్పటికే అమలు చేస్తున్న జీవిత బీమా, ఇతర బీమా పథకాలు యథావిధిగా కొనసాగుతాయని వాటి పరిధిలోకి రాని కుటుంబాలను మాత్రమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(ఐకేజీబీపీ)లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ఈ పథకం కింద నమోదైన వ్యక్తి మరణించినప్పుడు వారి నామినీ(ల)కు రూ.5 లక్షల బీమా సాయం అందుతుందని తెలిపింది. బీమా కోసం ప్రతిపాదిత వ్యక్తి స్వయంగా శిబిరానికి హాజరై నామినీల వివరాలు అందిస్తేనే నమోదు చేయాలని సూచించింది. అనారోగ్యం లేదా దివ్యాంగులు హాజరు కాలేని సందర్భంలో శిబిరం ఇన్‌ఛార్జి వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది.…
V6 Velugu ·
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం హైదరాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, అర్హులైన ప్రతి కుటుంబం పథకంలో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. 18 నుంచి 54 ఏళ్ల వయస్సు కలిగిన అర్హులైన సంపాదనపరులకు ఈ బీమా వర్తిస్తుందని వెల్లడించారు. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా నిర్దేశిత అర్హతలు కలిగిన వారికి పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు.
Namasthe Telangana ·
– ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపహాడ్, నవంబర్ 20 : ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా పథకం అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో సర్పంచ్ బాణోతు నరసింహ, ఎంపీడీవో జమలారెడ్డి అధ్యక్షతన ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా పథకాన్ని జిల్లా పంచాయతీ అధికారి అనూష, జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. తొలుత లబ్దిదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించి అనంతరం ఇంటింటి జీవిత బీమా పథకం పత్రాలను లబ్దిదారులకు ఆయన స్వయంగా అందజేశారు.…
Namasthe Telangana ·
చుంచుపల్లి, నవంబర్ 20 : పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా భరోసా కార్యక్రమాన్ని శుక్రవారం రామాంజనేయ కాలనీ గ్రామ పంచాయతీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి హెచ్. వెంకటేశ్వర్లు, ఎంపీడీవో సుభాషిని, తాసీల్దార్ నాగరాజు, గ్రామ సర్పంచ్ సరిత ఠాగూర్, ఉప సర్పంచ్ నగేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా భరోసా పథకం ఉద్దేశం, ప్రయోజనాలు, అమలు విధానంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా…
Eenadu ·
చిలుకూరు: మండలవ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని’ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ముక్కపాటి నరసింహరావు, తహసీల్దారు ధృవకుమార్ అన్నారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ హాలులో జీవిత బీమా పథకం కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 18 నుంచి 59 ఏళ్లలోపు వారంతా దీనికి అర్హులేనని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి పుల్లమ్మ, ఉపసర్పంచి నాగయ్య, పంచాయతీ కార్యదర్శి షరీపుద్దీన్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
పాఠశాలకు పూర్వ విద్యార్థుల చేయూత
Namasthe Telangana ·
– చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు
చండూరు, నవంబర్ 20 : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి అర్రులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు సూచించారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం, అదేవిధంగా లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్స్ పత్రాలను స్థానిక పీఆర్ గెస్ట్ హౌజ్ నందు శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్సిస్తున్నట్లు…
Eenadu ·
ఎల్లారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పురపాలకలోని 2వ వార్డులో మున్సిపల్ ఛైర్మన్ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీమా పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం, ఇంటి పెద్దకు అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జగ్జీవన్, వైస్ ఛైర్పర్సన్ భాగ్యవతి, వార్డు కౌన్సిలర్లు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Eenadu ·
శంకరపట్నం: ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో ప్రతి నిరుపేద కుటుంబానికి భరోసా కల్పిస్తోందని శంకరపట్నం మండలం ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్ అన్నారు. శుక్రవారం రాడికల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మాట్లాడుతూ బీమా నమోదు కార్యక్రమం నెలరోజుల పాటు కొనసాగుతోందన్నారు. రేషన్ కార్డు లేని కుటుంబాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్డులో నమోదు యజమానికి బీమా వర్తిస్తుందన్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనిత, తహసీల్దార్ సురేఖ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » indiramma family life insurance registration
ABN , Publish Date - Nov 20 , 2026 | 09:42 AM
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.