Namasthe Telangana ·
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
Cyclone Arnab : బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన ‘అర్నాబ్ తుపాను (Arnab Cyclone)’ తీరంవైపు దూసుకొస్తున్న నేపథ్యంలో పర్యాటకుల (Tourists) భద్రతను దృష్టిలో ఉంచుకుని పాపికొండల (Papi Kondalu) విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈరోజు నుంచి గోదావరి నది (Godavari River) లో పర్యాటక బోట్ల (Tourist Boats) రాకపోకలను పూర్తిగా రద్దుచేస్తూ రంపచోడవరం సబ్-కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.
తుపాను ప్రభావంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైనగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాజమండ్రి, భద్రాచలం తదితర ప్రాంతాల నుంచి సర్వీసులు నడిపే సుమారు 16 పర్యాటక బోట్లను నిలిపివేశారు. గతంలో గోదావరికి వచ్చిన భారీ వరదల కారణంగా సుమారు 70 రోజులపాటు నిలిచిపోయిన పాపికొండల యాత్ర, కేవలం రెండు వారాల క్రితమే తిరిగి ప్రారంభమైంది.