We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
The Telangana cabinet decided to organize a state-wide 'Indiramma Illu' Diwali program and launch the 'Indiramma Family Life Insurance' scheme. Additionally, the cabinet resolved to split the existing SC/ST commission and amend the Telangana Fire Service Act, 1999.
దీపావళి పండుగ సందర్భంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. 2026 నవంబర్ 5వ తేదీన సీఎం రేవంత్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల25 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయినందున.. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి కార్యక్రమంలో పాల్గొనాలని సమావేశం నిర్ణయించింది.
The central government announced the early release of ₹1,09,019 crore in tax devolution funds to the states on November 5, 2026, ahead of Diwali, which is five days earlier than the scheduled November 10 date.
The Brihanmumbai Municipal Corporation (BMC) deleted a Diwali video featuring actress Dia Mirza from its social media account after the Mumbai BJP chief objected to it. The video promoted a pollution-free Diwali, aligning with recent High Court orders regarding firecracker usage.
హిందువులు జరుపుకొనే పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. ధనత్రయోదశి రోజును చాలా భక్తి శ్రద్దలతో పూజిస్తారు. దీనినే దంతేరాస్ అనికూడా అంటారు. అలాంటి పవిత్రమైన రోజు ఈ ఏడాది (2026) నవంబర్ 6 వ తేదీ వచ్చింది. ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని.. ధన్వంతరి భగవానుడిని..సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని పూజిస్తారు. మరి ఈ ఏడాది దంతేరాస్ రోజుకు లక్ష్మీదేవికి శుభముహూర్తం ఎప్పుడు ... ఎలా పూజ చేయాలి.. ఎందుకు పూజించాలో మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
హిందువులు ధనత్రయోదశి పండుగను అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. దేవతలు.. రాక్షసులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మథించే సమయంలో లక్ష్మీదేవి ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం త్రయోదశి రోజున జన్మించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ సమయంలో విష్ణుమూర్తి ఆమెను భార్యగా స్వీకరించి .. సిరి సంపదలకు, ఐశ్వర్యానికి అధి దేవతగా ప్రకటించారు.
లక్నో: యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన కింద అర్హత కలిగిన పేద కుటుంబాలకు దీపావళి, హోలీ పండుగల సందర్భంగా ఉచితంగా ఒక్కో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 1.89 కోట్లకు పైగా పేదలకు ఈ ప్రకటనతో లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద సబ్సిడీల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించింది. 'ఒక గ్యాస్ సిలిండర్ ధర రూ.983.45. కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.335 సబ్సిడీ అందిస్తుంది.
లబ్ధిదారులు రూ.648.55 చెల్లించాల్సి ఉంటుంది. కానీ పేద కుటుంబాలకు దీపావళి, హోలీ పండుగల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సిలిండర్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం. మీరు ఆదా చేసే డబ్బుతో దీపావళి మిఠాయిలు, ప్రమిదలు కొనుగోలు చేసుకోవచ్చు' అని సీఎం యోగీ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ కనెక్షన్ల కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారని, ప్రస్తుత ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నామని, ఇదే అసలైన సుపరిపాలన అని కొనియాడారు. నవంబర్ 7న జరగనున్న అయోధ్య దీపోత్సవం సామాజిక ఐక్యతకు ప్రతీక అని అభివర్ణించారు. కుల, మత…
దీపావళికి సంబంధించి బౌద్ధంలో రెండు సందర్భాలున్నాయి. వాటిని ఒకసారి గుర్తుచేసుకుందాం. ఒకటి- ఆషాఢ పౌర్ణమి నుంచి ఆశ్వయుజ పౌర్ణమి వరకూ బౌద్ధ భిక్షువులు వర్షావాసం చేస్తారు. వర్షాకాలం వలన ఈ నాలుగు నెలలు ఏదో ఒక గ్రామంలోనే బస చేస్తారు. అలా వర్షావాసం ముగించుకుని, బుద్ధుడు తొలిసారి కపిలవస్తు నగరాన్ని సందర్శించాడు. తథాగతునికి స్వాగతం పలుకుతూ రాజ్యమంతా వేడుకలు జరిగాయి. ఆయన రాకకు హర్షాతిశయంతో ప్రజలు ఇళ్ల ముందు, రహదారులకు అటూ ఇటూ దీపాలు వెలిగించి.. ‘ధమ్మ దీపావళి’గా చేసుకున్నారు. ఈ రోజున దీపాలు వెలిగిస్తారు. బౌద్ధంలో దీపం అంటే కేవలం అలంకరణ మాత్రమే కాదు, అది అవిద్య అనే అంధకారాన్ని తొలగించి, జ్ఞానదీప్తిని…
రెండు- కళింగ యుద్ధం తర్వాత అశోకుడు యుద్ధ హింసను విడనాడి ఉపగుప్తుని సమక్షంలో బౌద్ధధర్మాన్ని స్వీకరించాడు. ధమ్మ ప్రచారం కోసం అశోకుడు వేలాది బౌద్ధ స్థూపాలు, బౌద్ధ విహారాలు నిర్మించాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నగరాలన్నింటినీ దీపాలతో అలంకరించి.. ‘ధమ్మ దీపావళి’గా వేడుక చేసుకున్నారు.
అతని జీతం నెలకు 50 వేల రూపాయలు.. పని చేసేది ఐటీ కంపెనీలో అనుకోండి.. ఆ కంపెనీ దీపావళి బోనస్ ఇవ్వాలి అనుకుంటే ఎంత ఇస్తుంది.. రెండు, మూడు నెలల జీతం లేదా ఓ ఐఫోన్.. లేదా ఐదు, 10 లక్షల కారు ఇస్తుంది.. అవును కదా.. ఇప్పటి వరకు అలాగే చూశాం.. విన్నాం. ఇప్పుడు మాత్రం ఓ ఐటీ కంపెనీ.. తన ఉద్యోగులకు దీపావళి బోనస్ కింద ఏకంగా 4 సంవత్సరాల జీతం ఇచ్చింది.. అంటే 50 వేల రూపాయలు జీతం వచ్చే ఉద్యోగి.. ఏకంగా 25 లక్షల రూపాయల బోనస్ అందుకోనున్నాడు.. ఇంత బోనస్ ఇస్తున్న ఐటీ కంపెనీ ఏంటీ.. ఈ బోనస్ నిజమేనా.. ఇండియాలోనా లేకపోతే విదేశాల్లోనా.. అసలు ఇది నిజమా కాదా అనేది పూర్తి తెలుసుకుందామా...
మైక్రాన్ కంపెనీ ఇండియాలోని తమ ఉద్యోగులకు 3 నుంచి 4 ఏళ్ళ జీతాన్ని బోనస్ గా ఇస్తోందని రెడిట్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ రేంజ్ బోనస్ ఇస్తున్నారన్న వార్తలు నిజమేనని... తమ కంపెనీ భారీగా క్యాష్, స్టాక్ అవార్డ్స్ ఇస్తోందంటూ టెకీ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
దీపావళి పండుగ సందర్భంగా ఓ కంపెనీ ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్స్ ఇచ్చి సప్రయిజ్ చేసింది. సాధారణంగా పండుగలకు కంపెనీలు స్వీట్లు, బట్టలు లేదా ఏదైనా చిన్న చిన్న కానుకలు ఇస్తుంటాయి. కానీ ఢిల్లీలోని ఓ కంపెనీ మాత్రం ఉద్యోగులకు ఏకంగా ఐఫోన్ 16 స్మార్ట్ఫోన్లను గిఫ్ట్‌గా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీ, ఉద్యోగులకు ఐఫోన్లు బహుమతిగా ఇచ్చిన వీడియోను అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఉద్యోగుల డెస్క్‌లపై అందంగా రిబ్బన్లు కట్టిన ఐఫోన్ 16 ఫోన్లు కనిపిస్తున్నాయి. దీపావళి పండుగ వేడుకల్లో భాగంగా కంపెనీ ఈ సర్ప్రైజ్ ఇచ్చింది.
దీపావళి అంటేనే ప్రత్యేకమైన పండుగ. నోరూరించే స్వీట్లు, మిరుమిట్లుగొలిపే దీపాల వెలుగులు. హోరెత్తించే క్రాకర్స్... ఇలా ఎంతో హడావిడి ఉండే సంబురం దీపావళి. ఈ పండుగలో అన్నింటికంటే స్వీట్స్ కాస్త ఎక్కువ స్పెషల్. బయటినుంచి తెచ్చుకునే స్వీట్స్ కంటే... ఇంట్లో చేసుకుంటే అవి ఇంకింత బాగుంటాయి.తియ్యటి స్వీట్స్ , మనసారా ఇచ్చే పర్సనల్ టచ్ స్పెషలే కదా మరి! బి స్వీట్స్ రెసిపీస్ మీ కోసం...!
రెండు రకాల చాక్లెట్ ను వేరు వేరు గిన్నెల్లో తీసుకుని వాటిని కరిగించాలి. కరిగించిన చాక్లెట్స్ రెండింటినీ ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ సిరీస్ లో మీకు నచ్చిన ఫ్లేవర్ కలుపుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కావాలనుకున్నా వేసుకోవచ్చు ఈ చాక్లెట్ మెర్టెడ్ సిరప్ క్రాకర్స్ సిలికాన్ చాక్లెట్ మాల్స్ లో వేయాలి. ఈ మాల్స్ ను పావుగంట డీప్ ఫ్రిజ్ లో పెట్టి బయటకు తీయాలి. బయటకు తీశాక వాటిని గోల్డెన్ ఫాయిల్ పేపర్లో చుట్టాలి. వీటి పై క్రాకర్స్ స్టిక్కర్స్ అంటిస్తే మమ్మీ క్రాకర్స్ స్వీట్స్ తినేందుకు సిద్ధంగా ఉంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళిని పురస్కరించుకుని.. దిల్లీకి చెందిన ఓ కంపెనీ ఉద్యోగులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఉద్యోగులందరికీ ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ (iPhone 16)లను ఇచ్చింది.(Diwali Gifts). రోహిణి ప్రాంతంలోని ‘ఫైనాన్సర్సాబ్’ అనే సంస్థ (Delhi Company) ఉద్యోగులు రాకముందే.. వారి డెస్క్‌లపై ఐఫోన్ 16 హ్యాండ్సెట్లు ఏర్పాటు చేసింది. ఆఫీస్‌కు రాగానే తమ డెస్క్‌లపై ఉన్న ఐఫోన్లు చూసి.. ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను ఆ సంస్థ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను షేర్ చేస్తూ.. మరి మీ కంపెనీలు ఏం ఇచ్చాయి? అంటూ ఆ సంస్థ క్యాప్షన్ పెట్టింది. దీపావళి సమయంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు స్వీట్లు, గిఫ్ట్ హ్యాంపర్లు, నిత్యావసర వస్తువులను ఇస్తుంటాయి. అందుకు భిన్నంగా ఈ సంస్థ ఐఫోన్లు ఇవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలో చేరడానికి ఏమైనా ఖాళీలు ఉంటే చెప్పండంటూ ఓ నెటిజన్ సరదాగా స్పందించారు. ఇదీ చదవండి: ఆ టపాసుల సంగతేంటో చూడండి: కేంద్రానికి సుప్రీం ఆదేశాలు
దసరా ఆఫర్లు మిస్సయ్యాం.. దీపావళికి భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటాయి.. కొందాం అనుకునే వాళ్లకు ఇది షాకింగ్ న్యూసే. ధరలు తగ్గుతాయి అనుకుంటే కొండెక్కి కూర్చున్నాయి. కనీసం 3 నుంచి 7 శాతం వరకు రేట్లు పెరిగాయి. చివరికి స్వీట్ల ధరలు కూడా పెరగటం ఆందోళనకరం. ఏ ఏ వస్తువుల రేట్లు ఎంత మేరకు పెరిగాయో చూద్దాం.
హయర్, ఎల్జి, బ్లూస్టార్ వంటి బ్రాండ్లు తమ ఉత్పత్తుల ధరలను 3-7 శాతం పెంచాయి. హావెల్స్ కూడా 2026 డిసెంబర్ నాటికి 5-7 శాతం వరకు ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది. రా మెటీరియల్స్ ధరలు, డెలివరీ ఖర్చులు పెరగడమే దీనికి కారణం అని పేర్కొంటున్నారు.
హిందువులు ఎంతో ఆనందంగా జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. దీపాల పండుగగా పేరొందిన దీపావళి కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతి ఇల్లు దీపాల వెలుగులతో మెరిసిపోతుంది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు. దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కొత్త బట్టలు ధరించి కుటుంబంతో కలిసి పండుగను ఘనంగా జరుపుకుంటారు.
2026లో దీపావళి పండుగను నవంబర్ 8, ఆదివారం రోజున రానుంది. అయితే దీపావళి వేడుకలు ఒక్కరోజుతో ముగియవు. ధన్‌తేరస్‌తో ప్రారంభమై భాయ్ దూజ్ వరకు ఐదు రోజుల పాటు వివిధ పండుగలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది.
ముంబై: దివాళీ పటాకుల గురించి బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసిన నటి దియా మీర్జా(Dia Mirza) వీడియోను డిలీట్ చేసింది. ఆ వీడియోపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో బీఎంసీ ఆ చర్యకు పాల్పడింది. కాలుష్య రహిత దివాళీ చేసుకోవాలని వీడియోలో నటి దియా మీర్జా కోరింది. అయితే ముంబై బీజేపీ చీఫ్ అమీత్ సత్నం ఆ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రాజకీయ వివాదం రేగింది. భారీగా బాణాసంచా కాల్చవద్దు అని, పర్యావరణహితంగా దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలని ఇటీవల ముంబై హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. కాలుష్య నియంత్రణ కోసం హై కోర్టు ఆ ఆదేశాలు…
హిందువులు జరుపుకొనే పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. ఈ ఏడాది(2026) దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి. చీకటిపై వెలుగుల విజయానికి సంకేతమైన ఈ పండుగలో, లక్ష్మీదేవి పూజశుభ ముహూర్తం ఎప్పుడు.. దీపావళి పండుగ పూజా సమయం.. తేదీ మొదలగు విషయాలను ఈస్టోరీలో తెలుసుకుందాం. . .
హిందువులు జరుపుకొనే పండుగల్లో దీపావళి. ప్రతి ఏడాది ఆశ్వయుజమాసం అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకుంటారు. చీకటిపై వెలుగుకు ప్రతీకగా ఈ పండుగను నవంబర్ 8 వ తేదీన జరుపుకుంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఇళ్లను శుభ్రం చేసి, రంగురంగుల ముగ్గులు వేసి, దీపాలు వెలిగించి లక్ష్మీ గణేశులను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
దీపావళి పండుగ మరో కొద్ది రోజుల్లో రాబోతుంది. దీపావళి ముందు నరక చతుర్థశిని జరుపుకుంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం కొంతమంది నరకచతుర్ధశి( 2026 నవంబర్7) హనుమంతుడిని పూజిస్తారు. పురాణాల ప్రకారం ఆంజనేయుడిని పూజించిన వారికి బలం, ధైర్యం కలగడమే కాకుండా .. ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్ 7 వ తేదీన హనుమంతుడిని పూజించేందుకు శుభ ముహూర్తం.. పూజా విధానం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
పూర్వీకుల నమ్మకాల ప్రకారం ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం చతుర్ధశి రోజు దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు, చెడు భావనలు గరిష్టస్థాయిలో ఉంటాయి. అంతే కాదు ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. ఇలాంటి వాటిని తొలగించుకొనేందుకు నరకచతుర్ధశి రోజు హనుమంతుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు.
తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది.మహిళలకు ఉపాధి కల్పించడంతోపాటు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా మరో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మిల్లెట్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు కేఫ్‌లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కేఫ్‌ల ఏర్పాటుకు మొత్తం రూ.11 కోట్లు ఖర్చు చేయనుండగా, ఒక్కో కేఫ్‌కు రూ.2.2 కోట్ల చొప్పున కేటాయించనున్నారు.
నవంబర్ 19న ప్రారంభించేందుకు సన్నాహాలుమహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, అద్దె ఆర్టీసీ బస్సులు, డెయిరీ ఫామ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే తరహాలో మిల్లెట్ కేఫ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నవంబర్ 19న ఈ కేఫ్‌లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలి విడతలో హైదరాబాద్‌లో మూడు, యాదాద్రి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు కేఫ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 40 మంది మహిళలకు అవసరమైన శిక్షణ కూడా అందించారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఈ కేఫ్‌లను ఏర్పాటు చేయనున్నారు.…
గత నెల చివరి వారంలో అనూహ్యంగా పతనం అయిన బంగారం, వెండి రేట్లు మళ్లీ నవంబర్ మాసంలో తిరిగి పుంజుకుంటున్నాయి. దీంతో దీపావళికి షాపింగ్ చేద్దాం అనుకుంటున్న వారికి రేట్లు భారంగా మారిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రస్తుతం షాపింగ్ చేయాలని అనుకుంటున్నట్లయితే సోమవారం రోజున తమ సమీప నగరాల్లో మారిన రిటైల్ గోల్డ్ అండ్ సిల్వర్ విక్రయ ధరలను పరిశీలించటం బెటర్.
నవంబర్ 2న బంగారం రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు నవంబర్ 1 కంటే రూ.49 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 937గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 775గా కొనసాగుతోంది.
Festivals In November 2026: దీపావళి విజయ ముహూర్తం ఎప్పుడు? నవంబరులో పండుగలు, ప్రత్యేకతలివే
Not analysed for framing
Diwali 2026| ఇంటర్నెట్ డెస్క్: భారతీయ సనాతన ధర్మంలో కార్తిక మాసానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. శివకేశవుల ఆరాధనకు, దీపారాధన, ఉపవాస నియమాలకు, దాన ధర్మాలకు ఈ మాసం ఎంతో ప్రత్యేకం. దీపావళి పర్వదినం నుంచి కార్తిక పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, ధార్మిక సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయి.
గాంధీనగర్: దీపావళి పండుగ సందర్భంగా అర్హులైన 143 మంది ఖైదీలకు గుజరాత్ ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసింది. ధంతేరస్ అయిన నవంబర్ 6న వారిని విడుదల చేయనున్నది. దీంతో ఆ ఖైదీలు తమ కుటుంబాలతో కలిసి 15 రోజులు ఉండనున్నారు. తమ వారితో కలిసి దీపావళి జరుపుకుంటారు. (Diwali Parole) ఖైదీల సంక్షేమం, జైలు సంస్కరణల కార్యక్రమంలో భాగంగా అర్హులైన ఖైదీలు వారి కుటుంబాలతో కలిసి దీపావళి జరుపుకునే అవకాశాన్ని కల్పించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 143 మంది అర్హులైన ఖైదీలకు 15 రోజుల దీపావళి పెరోల్‌ను మంజూరు చేశారు.…
కాగా, గుజరాత్ ప్రభుత్వం 2003 నుంచి ప్రతి సంవత్సరం అర్హులైన ఖైదీలకు దీపావళి సందర్భంగా 15 రోజుల పెరోల్‌ను మంజూరు చేస్తున్నది. అర్హులైన మహిళా ఖైదీలు, 60 ఏళ్లు పైబడిన అర్హులైన పురుషులకు ఇది లభిస్తుంది. దీని కోసం సంబంధిత నియమ నిబంధనలతో పాటు కొన్ని మార్గదర్శకాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
తెలంగాణలోని గిరిజన తండాల్లో దీపావళి వేడుకలకు ప్రత్యేకతే వేరు. ప్రకృతితో మమేకమైన జీవనం... పశుసంపదపై అపారమైన ప్రేమాభిమానాలు... తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలు! వ్యవసాయానికి అండగా నిలిచే పశువులను పూజిస్తూ ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో పండుగను జరుపుకుంటారు.
పశువులను పూజించడం వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు తమ జీవనాధారంపై కృతజ్ఞత కూడా ఉంది! ప్రకృతిని ఆరాధిస్తూ... సంప్రదాయాలను గుండెల్లో దాచుకుంటూ... గిరిజన తండాలు చాటుతున్న సందేశం ఒక్కటే.. ప్రకృతిని ప్రేమించాలి... జీవనాధారాలను గౌరవించాలి. ఆదిలాబాద్, ఖమ్మం ప్రాంతాల్లోని అన్ని గిరిజన తెగలూ దీపావళిని వివిధ రకాలుగా జరుపుకుంటారు. గోవర్ధన పూజ, పశువుల ఆరాధన, తండా ఆచారాలను బట్టి చేస్తారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.