Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆశల పోరుబాట
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ఆశా వర్కర్లు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీని నిలబెట్టుకోకపోవడంపై కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ.18 వేల ఫిక్డ్స్ వేతనం, రూ.5 లక్షల జీవిత బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు.
డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ.18 వేల ఫిక్డ్స్ వేతనం చెల్లించాలని, రూ.5 లక్షల జీవిత బీమా కల్పించాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని లేదంటే డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని వెల్లడించారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు పారితోషికాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలని కోరారు. ప్రతి ఆదివారం, పండుగలకు ప్రభుత్వ ఉద్యోగులుగా మాదిరిగానే 20 రోజుల క్యాజువల్, ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్, ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. ఏఎన్ఎం, జీఎన్ఎం ట్రైనింగ్ చేసిన ఆశాలకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని కోరారు. 2వ పీఆర్సీలో ఆశా వర్కర్లకు రూ.30 వేల కనీస వేతనం నిర్ణయించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 2 డీఏలు ఆశలకు వర్తింపజేయాలన్నారు. అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చుకుంటే నిరవధిక సమ్మె నోటీసు జారీ చేస్తామని హెచ్చరించారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)