Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా (కె) గ్రామంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి చిత్రపటానికి గ్రామస్తులు ఒకరోజు ముందుగానే దీక్షా దివస్ నిర్వహించారు.
కేసీఆర్ 2009లో చేసిన ఆమరణ నిరాహార దీక్షను, తెలంగాణ సాధనలో ఆయన చూపిన త్యాగనిరతిని గ్రామస్తులు నెమరు వేసుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని గ్రామస్తులు పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Diksha Divas : ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఇచ్చోడ (Icchoda) మండలం ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందుగానే దీక్షా దివస్ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS chief KCR) 17 ఏళ్ల క్రితం ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే గొప్ప త్యాగనిరతితో దీక్షను చేపట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, నెమరు వేసుకుందామని ఈ సందర్భంగా గ్రామస్తులు పేర్కొన్నారు. కేసీఆర్ 2009 నవంబర్ 29న తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టి కేంద్రం మెడలు వంచిన రోజును దీక్షా దివస్‌గా జరుపుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇచ్చిన పిలుపు మేరకు..…
ముఖ్రా (కె) గ్రామస్తులు ఎడ్లబండిపై కేసీఆర్ ఫోటో పెట్టుకుని, డప్పులు వాయిస్తూ పంట పొలాల్లో కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం, పాలాభిషేకం చేశారు. కేసీఆర్ లేకుండా 300 ఏళ్లయినా తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభించి, తెలంగాణ సాధించే వరకు వెనకడుగు వేయని నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిపారని, మళ్లీ కేసీఆర్ వస్తేనే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయని, కేసీఆర్ తప్ప మరో నాయకుడు తెలంగాణను అభివృద్ధి చేయలేడని పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)