Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎవరికెవరు ఈ లోకంలో...
By Eenadu2 min read at Eenadu
In brief
నారదమహర్షి మరియు రత్నాకరుడి మధ్య జరిగిన సంభాషణను ఈ కథనం వివరిస్తుంది, దీని ద్వారా రత్నాకరుడు వాల్మీకిగా మారినట్లు తెలుపుతుంది.
వసిష్ఠ మహర్షి మరియు విశ్వామిత్రుడి కథను, అలాగే సంసార బంధాల గురించి కవుల అభిప్రాయాలను ఇది చర్చిస్తుంది.
ముంబైలో నివసించే లలితా కృష్ణమూర్తి తన పిల్లల కోసం 40 ఏళ్లుగా ఎదురుచూస్తూ ఇటీవల మరణించిన విషయాన్ని ఈ కథనం నివేదిస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
‘దారినపోయే బాటసారులను బెదిరిస్తూ, హింసిస్తూ అడవిలో దోపిడీలకు పాల్పడుతున్నావు. ఇంతటి మహాపాపాన్ని మూటగట్టుకోవడం ఎందుకు? ఎవరి కోసం?’ అని అడిగారు నారదమహర్షి. ‘నా భార్యాపిల్లల పట్ల నాకు అంతులేని ప్రేమ. వారిని పోషించడం కోసం’ అన్నాడు రత్నాకరుడు. ‘ఓహో! అయితే ఈ దోచుకున్న సొమ్ముకోసం ఎగబడుతున్న నీ వాళ్లెవరైనా- నీ పాపంలో కాస్త భాగం పంచుకుంటారేమో కనుక్కుని చెప్పు’ అన్నారు మహర్షి. వారంతా ససేమిరా అనేశారు మూకుమ్మడిగా. మరుక్షణంలో జ్ఞానోదయమైంది రత్నాకరుడికి. దాంతో వాల్మీకిగా మారాడు. ఆ ప్రాచేతసుడి గురించి లోకంలో ప్రాచుర్యంలో ఉన్న ఈ కథ చిన్నదే- సందేశం మాత్రం సముద్రమంత లోతైనది. వసిష్ఠ మహర్షి సైతం ఇదే తరహా…
‘కనులకు తోచి, నోటికి అందని ఎండమావులుంటాయి’ అన్నారు కవులు. సంసారమే పెద్ద ఎండమావి. అదొక మహామాయ. ‘పుత్రమిత్ర జన సంపత్ భ్రాంతి’లోకి దించి, ‘వాంఛాలత’లతో బంధిస్తుంది. మోహంలో ముంచి తేలుస్తుంది. ‘ఆ భ్రమ ఎలాంటిదంటే... గొర్రె మెడకు తాడుకట్టి లాక్కుపోతుంటారు- చంపి చర్మం ఒలిచేందుకు! అది తెలియని ఆ అమాయక జీవి దారికి ఇరువైపులా ఉండే పచ్చని గరికపరకలు తినేందుకు ఆశ పడినట్లు’ అన్నారు విశ్వనాథ. కన్నబిడ్డలు సరే, పెంచి పెద్దచేసిన శకుంతలను అత్తారింటికి పంపిస్తూ- ‘హమ్మయ్య! బరువు దించుకున్నాను’ అనుకున్న కణ్వమహర్షి సైతం- వియోగ దుఃఖంతో కన్నీరు మున్నీరైన వైనాన్ని కాళిదాసు కరుణరసభరితంగా ఆవిష్కరించాడు శాకున్తలమ్లో.…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)