Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మహర్షి వాల్మీకి జీవితం ఆదర్శనీయం : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొని, వాల్మీకి జీవితం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
పురాణాల ప్రకారం రత్నాకరుడిగా పేరొందిన వాల్మీకి తన తప్పులను సరిదిద్దుకుని రామాయణాన్ని రచించారని, మనిషి తన తప్పులను గుర్తించి సన్మార్గంలో నడిస్తే జీవితంలో గొప్ప మార్పు సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
ప్రతి ఒక్కరూ వాల్మీకి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మెదక్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పురాణ గాథల ప్రకారం తొలినాళ్లలో రత్నాకరుడిగా పేరొందిన వాల్మీకి దారి దోపిడీలకు పాల్పడేవారని, సప్తర్షుల బోధనలతో ఆత్మపరిశీలన చేసుకుని తన జీవితాన్ని మార్చుకున్నారని పేర్కొన్నారు. అనంతరం కఠోర తపస్సుతో మహర్షిగా ఎదిగి ఆదికావ్యమైన రామాయణాన్ని రచించి ప్రపంచానికి ధర్మం, సత్యం, న్యాయం…
మనిషి తన తప్పులను గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటూ సన్మార్గంలో నడవాలని సంకల్పించుకుంటే జీవితంలో గొప్ప మార్పు సాధ్యమవుతుందని వాల్మీకి జీవితం నిరూపిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ మహర్షి వాల్మీకి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సత్ప్రవర్తనతో మెలుగుతూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్, డీఎస్పీ రంగనాథ్, ఆర్ఐ శైలేందర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)



