Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్
By Eenadu||1 min read at Eenadu
In brief
Nandyal District Collector Rajakumari Ganiji and SP Sunil Shorey inspected the Alagadda constituency nomination centers in Andhra Pradesh following tensions on the 22nd of the month.
They ordered strict security, CCTV, and drone surveillance to ensure a peaceful election process and warned of legal action against those violating the rules.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శిరివెళ్ల: ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్ల, రుద్రవరం నామినేషన్ కేంద్రాల వద్ద ఈనెల 22న చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో సంబంధిత కేంద్రాలను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జిల్లా సునీల్ షొరాణ్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత ఆర్వోలు, విధుల్లో ఉన్న పోలీసుల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని, నామినేషన్ కేంద్రాల వద్ద విధుల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలిచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల సరళిని పరిశీలిస్తూ…
నామినేషన్లు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా విధించిన ఆంక్షలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులుగా ఉండవద్దన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, స్వేచ్చాయుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ఆయా పార్టీల నాయకులు, ప్రజలు, అభ్యర్థులు బాధ్యతాయుతంగా వ్యవరించాలని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులకు ప్రజలు సహకరించాలని, అనుమతి పొందిన వాహనాలు, వ్యక్తులు మాత్రమే నామినేషన్ కేంద్రాల్లో వెళ్లవచ్చన్నారు. పోలీసుల నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడమని…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)