Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
పంటలను పరిశీలించిన వ్యవసాయ కళాశాల విద్యార్థులు
By Prajasakti1 min read at Prajasakti
In brief
Students and scientists from Acharya N.G. Ranga Agricultural College visited Kapavaram village in Samarlakota mandal to assess cyclone-related damage to paddy crops.
Dr. Sitarama Sarma from the Peddapuram Aeruvaka Kendra explained the damage and advised on precautions for sprouting grains.
The article also details fungicide treatments to manage rot diseases.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తుపాను ప్రభావంతో సామర్లకోట మండలంలో వరి పంటకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బాపట్ల ఆచార్య ఎన్జీ రంగావ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థులు, శాస్త్రవేత్తల బృందం శుక్రవారం కాపవరం గ్రామాన్ని సందర్శించారు. వ్యవసాయ విద్యార్థులకు క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రత్యక్ష అవగాహన కల్పించి, పరిశీలన ద్వారా నేర్చుకునే విధానంలో భాగంగా ఈ పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దాపురం ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ సీతారామశర్మ విద్యార్థులకు తుపాను కారణంగా దెబ్బతిన్న వరి పంట పరిస్థితులను వివరించారు. గింజ గట్టిపడే దశలో ఉన్న వరి పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో నేలకొరిగి, కంకుల్లో మొలకలు కనిపిస్తే…
పొలాల్లో నీరు తగ్గిన తరువాత ఎకరాకు 400 మిల్లీ లీటర్ల హెక్సాకొనజోల్ లేదా 200 మిల్లీ లీటర్ల ప్రొపికొనజోల్ పిచికారీ చేయడం ద్వారా మాగుడు తెగులు వ్యాప్తిని తగ్గించవచ్చన్నారు. మానిపండు తెగులు నివారణకు ఎకరాకు 200 మిల్లీ లీటర్ల ప్రొపికొనజోల్ పిచికారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు, డాక్టర్ సలాం, డాక్టర్ బిందు ప్రవీణ, సుజాత, వ్యవసాయ శాఖ ఎఇఒలు కమల, విఎఎలు భవిత, జాయ్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)