Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : డీఏఓ వి.బాబురావు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ములకలపల్లి మండల కేంద్రంలో ఎల్ నినో వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు.
జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు మాట్లాడుతూ, యాసంగి సీజన్లో తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు.
వరి కొయ్యాలను కాల్చడం వల్ల కలిగే అనర్థాలపై రైతులకు అవగాహన కల్పించి, రంగాపురం, గొల్లగుడెం గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ములకలపల్లి, నవంబర్ 27 : ఎల్ నినో వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వ్యవసాయం, ఖేత్ బచావో అభియాన్, ప్రత్యామ్నాయ పంటల సాగుపై శుక్రవారం ములకలపల్లి మండల కేంద్రంలో రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు పాల్గొని మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం, స్థిరమైన వ్యవసాయ పద్ధతుల ఆచరణ, యాసంగి సీజన్లో తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం, వరి కొయ్యాలను కాల్చడం వల్ల కలిగే అనర్థాలపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ యాసంగిలో ఆరుతడి పంటలైన పెసర్లు, మినుములు, నువ్వులు, జొన్న, బొబ్బెర, కూరగాయలు పంటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం రంగాపురం గ్రామంలోని పొద్దుతిరుగుడు, బొబ్బెర జొన్న పంటలతో పాటు గొల్లగుడెంలో సాగు చేస్తున్న వేరుశనగ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు, వ్యవసాయ విస్తరణ అధికారలు రమేశ్, రాహుల్ గాంధీ, సుజాత, రైతులు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)