Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఉద్యమంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర కీలకం: స్పీకర్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఫోటో జర్నలిస్టుల పాత్రను గుర్తుచేశారు.
టీఎస్‌పీజేఏ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో రాష్ట్ర ఉత్తమ ఫోటో జర్నలిస్టుల అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, ఫోటో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రవీంద్రభారతి, నవంబర్ 21: తెలంగాణ ఉద్యమం సమయంలో అమరవీరుల త్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, తల్లుల కన్నీళ్లు నేటి తరానికి గుర్తుండటానికి ఫొటో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గుర్తుచేశారు. తెలంగాణ ఫొటో జర్నలిస్ట్సు అసోసియేషన్ (టీఎస్‌పీజేఏ)ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఫొటో జర్నలిస్టుల అవార్డుల ప్రదానోత్సవం టీఎస్‌పీజేఏ అధ్యక్షుడు ఏ గంగాధర్ అధ్యక్షతన శనివారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్(సురవరం ప్రతాపరెడ్డి హాల్)లో నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఖాజావిరాహత్అలీ, ప్రధాన కార్యదర్శి నారాయణ హాజరై ఉత్తమ ఫొటోజర్నలిస్టులకు అవార్డులు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. ఫొటో జర్నలిస్టులు కేవలం చిత్రాలు మాత్రమే బంధించేవారు కాదని.. చరిత్రను కండ్లకు కట్టే సాక్షులని తెలిపారు. ఒక వార్తను వందల పదాలతో వివరించవచ్చునని, కానీ ఒక ఫొటో క్షణాల్లో వేల భావాలను ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లగలదని పేర్కొన్నారు. ఫొటో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)