Eenadu ·
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
ములుగు: సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం ఆర్ అండ్ ఆర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు. ఎస్సై రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అన్నాసాగర్కు చెందిన కేసరి నర్సింలు (50) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి బైలంపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలోని బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లాడు. తిరిగి శుక్రవారం తన ద్విచక్ర వాహనంపై గ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో తునికి బొల్లారం సమీపంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సింలును…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.