Eenadu ·
crime news: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారు దగ్ధం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. విజయవాడకు చెందిన తాడేపల్లి ప్రవీణ్ (33) ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తన భార్యతో కలిసి కారులో విజయవాడ నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. హైదరాబాద్ శివారులోని బాటసింగారం వద్దకు రాగానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. గమనించిన దంపతులు వెంటనే కారు నుంచి బయటకు వచ్చారు. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. క్షణాల్లో మంటలు కారు మొత్తం వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.